నందమూరి నటన సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరీర్లు ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం పాటు వరస పెట్టి అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య అలాంటి సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి , బాబి కొల్లి దర్శకత్వంలో డాకు మహారాజు సినిమాల్లో హీరోగా నటించి వరుస పెట్టి విజయాలను అందుకున్నాడు.

ప్రస్తుతం బాలయ్య "అఖండ" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓ వైపు అఖండ 2 సినిమాలో నటిస్తున్న బాలయ్య మరికొన్ని సినిమాలను ఓకే చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బాలకృష్ణ కు వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ కు ఓ కథలు చెప్పనున్నట్లు తెలుస్తోంది.

అలాగే హరీష్ శంకర్ కూడా బాలకృష్ణ కోసం ఓ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణకు కథలను వినిపించనున్నట్లు , అందులో ఏ కథ నచ్చితే దానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు , ఒక వేళ రెండు నచ్చితే రెండింటికి సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఇద్దరు దర్శకులతో పని చేయడానికి రెడీ అవుతాడా లేదా ఒకరికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: