అక్కినేని కుటుంబంలో గత ఏడాది నాగచైతన్య ,శోభిత వివాహమైనప్పటినుంచి నాగచైతన్య తమ్ముడు అఖిల్ వివాహం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నాగార్జున అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలను సైతం షేర్ చేసినప్పటి నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. చివరిసారిగా 2023లో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలింది. ఇక అప్పటి నుంచి తన తదుపరి చిత్రం పై ఫోకస్ పెట్టారు. అలాంటి సమయంలోనే అఖిల్, బైనబ్ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిపించారు ఇరువురి కుటుంబ సభ్యులు.



ఇక త్వరలోనే వివాహం చేసుకోబోతున్న అఖిల్ మళ్ళీ సినిమాల పైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇంతవరకు అఖిల్ పెళ్లి డేట్ ని మాత్రం నాగార్జున అసలు చెప్పలేదు. ఈ విషయం పైన అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే అఖిల్ తన కాబోయే భార్య జైనబ్ తో కలిసి ఎయిర్పోర్టులో కనిపించారు. ఇద్దరు కారు దిగి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మరి లోపలికి వెళ్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ అఖిల్ పెళ్లి డేట్ త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు కావచ్చు.. పెళ్లి పనులు కోసమే ఎక్కడికో ఈ జంట వెళ్తున్నారనే విధంగా పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



మరి అఖిల్ త్వరలో పెళ్లి  పనులు జరుగుతున్నాయని విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హీరోయిన్గా శ్రీ లీల నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని కూడా ఏఎన్ఆర్ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మిస్తూ ఉన్నారు. మొత్తానికి అఖిల్ ఈ యేడాదే వివాహమైతే ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: