తమిళ నటుడు అజిత్ కుమార్ ఆఖరుగా విడ మూయర్చి అనే సినిమా లో హీరో గా నటించాడు . ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను రాబట్టిన ... టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే తాజాగా అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు.

మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 24.25 మిలియన్  వ్యూస్ ... 624 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే అజిత్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించడం , మార్క్ ఆంటోనీ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత అదిక్ రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak