టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి చాలా మూవీలతో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేస్తాడు అని వార్తలు బలంగా వచ్చాయి.

ఇక పుష్ప పార్ట్ 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుంది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా బన్నీ తన తదుపరి మూవీ ని అట్లీతో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రానుంది. ఇక బన్నీ , అట్లీ సినిమాతో బిజీ అయినట్లయితే త్రివిక్రమ్ మరి కొంత కాలం తన తదుపరి మూవీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి.

దానితో అనేక మంది త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా విడుదల అయిన తర్వాత వెయిట్ చేయకుండా వేరే హీరోతో సినిమాకు కమిట్ అయి ఉంటే ఇప్పటివరకు ఆ హీరోతో సినిమా కంప్లీట్ అయ్యేది అని , ఆ తర్వాత ఈయన అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసి ఉండుంటే అట్లీతో బన్నీ మూవీ కంప్లీట్ చేసుకునే లోపు ఆయన బన్నీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునేవాడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గుంటూరు కారం సినిమా విడుదల అయ్యి ఇప్పటికే సంవత్సరం కాలం దాటిపోయింది. మరి త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: