సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాల విడుదల తేదీల మధ్య చాలా గ్యాప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం చాలా తక్కువ సమయంలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల అయినట్లయితే ఏ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు రావు. అలాగే ఆ సినిమాలకు థియేటర్లను అడ్జస్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో మేకర్స్ భారీ క్రేజ్ ఉన్న సినిమాల విడుదల తేదీల మధ్య పెద్ద గ్యాప్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కానీ వచ్చే సంవత్సరం మార్చి నెలలో కేవలం 8 రోజుల గ్యాప్ లో ఏకంగా 4 పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి.


అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం యాష్ టాక్సిక్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 19 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇదే తేదీన బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న లవ్ అండ్ వార్ అనే సినిమాను కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ నలుగురు స్టార్ హీరోలు నటించిన ఈ 4 సినిమాలు కేవలం 8 రోజుల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: