మలయాళ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం మోహన్ లాల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో మోహన్ లాల్ పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉండటంతో ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ లాల్ , పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన లూసిఫర్ అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ "లూసీఫర్" మూవీ కి కొనసాగింపుగా ఎంపురన్ అనే మూవీ ని మోహన్ లాల్ హీరో గా రూపొందించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ సూపర్ జోష్ లో ముందుకు దూసుకుపోతోంది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ రేర్ ఫిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 ప్లస్ కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు , ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: