కొంత కాలం క్రితం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెలా అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. పెద్దగా అంచనాలు లేకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ద్వారా హెబ్బా పటేల్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఓదెలా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా ఓదెల 2 అనే మూవీ ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు.

తమన్నా ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను తాజాగా ప్రకటించారు. ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గాయిటీ గెలాక్సీ , బాంద్రా వెస్ట్ ముంబై లో ఏప్రిల్ 8 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. 

ఇకపోతే ప్రస్తుతం ఓదెల 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఈ మూవీ తో తమన్నా కు ఏ రేంజ్ గుర్తింపు వస్తుందో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: