మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈమె బేబీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

బేబీ సినిమా తర్వాత ఈమె లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా వైష్ణవి చైతన్య సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో వైష్ణవి చైతన్య వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే వైష్ణవి చైతన్య క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉంది.

అలాగే ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఈమెకు మరిన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కే ఛాన్స్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ... నా మొదటి క్రష్ రామ్ పోతినేని అని చెప్పుకొచ్చింది. అలాగే అబ్బాయిల్లో మొదటగా కళ్ళు , నవ్వు మాత్రమే గమనిస్తాను అని ఈ బ్యూటీ తెలిపింది. అలాగే అనుష్క , సాయి పల్లవి తన ఫేవరెట్ హీరోయిన్లుగా ఈ బ్యూటీ చెప్పకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: