
"గేమ్ ఛేంజర్" సినిమాతో సోషల్ మీడియాలో చాలా చాలా నెగిటివ్ ట్రోలింగ్ అందుకున్న రాంచరణ్ ఎలా అయినా సరే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను హైలైట్ అయ్యేలా మార్చుకోవాలి అని కష్టపడుతున్నాడు. రీసెంట్గా సినిమాకి సంబంధించిన పవర్ఫుల్ షార్ట్ GLIMPSE రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ గ్లింప అంతా బాగున్నప్పటికీ చాలా యాంగిల్స్ లో చూడడానికి అచ్చం పుష్ప సినిమాలో బన్నీ లుక్ లానే కనిపించాయి. దీంతో మరొకసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది .
మరి ముఖ్యంగా కొంతమంది ఘాటుగా "మీసాలు గడ్డాలు పెంచి రఫ్ లుక్ లో కనపడితే ప్రతి ఒక్కడు పుష్పరాజ్ అయిపోతాడా .. ? పుష్పరాజ్ అవ్వాలి అంటే దానికి ఒక స్టామినా ఒక లెవెల్ ఉండాలి ..అది బన్నికి మాత్రమే సాధ్యం అంటూ "కావాలని గతంలో జరిగిన ఇష్యూస్ మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో పెద్ది సినిమాకు ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది . పరిస్థితులు చూస్తుంటే పెద్ది సినిమాకు పెద్ద కలెక్షన్స్ రావని అంటున్నారు సినీ ప్రముఖులు . చూడాలి మరి పెద్ది సినిమాతో Mega power star రామ్ చరణ్ తన లైఫ్ ని ఎలా మార్చుకోబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!