
ఈ విషయం అక్కడ ఉన్న అభిమానులను నిరాశకు గురిచేసిన పెను ప్రమాదం నుంచి అక్కడ అభిమానులు తప్పించుకోవడంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా 10వ తేదీన ఈనెల విడుదల కాబోతోంది. త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితర నటి నటుల సైతం ఇందులో నటిస్తూ ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు కూడా అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది.ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా చాలా జోరుగానే కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అభిమానులు ప్రీమియర్ షోకు సిద్ధమవుతున్న సమయంలోనే.. పిఎస్ఎస్ సినిమా హాలులో అజిత్ కటౌట్ ఏర్పాటు చేస్తూ ఉన్న సమయంలో ఇనుప రాడ్లతో నిర్మించిన ఈ కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 2019లో కూడా అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తూ ఉండగా కటౌట్ కూలిపోవడంతో సుమారుగా ఐదు మందికి పైగా గాయాలయ్యాయి. ఇలాంటి విషయాల పైన హీరో అజిత్ అభిమానులను ఇలాంటి విషయాల పైన రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటివి చేయవద్దండి అంటూ కూడా తెలియజేశారు. మరొకసారి జరిగిన ఈ విషయం పైన అజిత్ ఎలా స్పందిస్తారో చూడాలి.