
అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం జనాలు ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా లాగినట్లు తెలుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ ఎక్కువ అన్న కారణంగానే ఇంత ఇష్యూ జరిగింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఇప్పుడు అత్తమ్మస్ కిచెన్ రేట్లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అలాగే కోడలు ఉపాసన అతమ్మాస్ కిచెన్ అంటూ ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫుడ్ సర్వీసెస్ చేస్తున్నారు .
ఈ ఫుడ్ ప్యాకెట్ల రేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అత్తమ్మాస్ కిచెన్ వెబ్సైట్లో మూడు పులిహోర పేస్టు ప్యాకెట్లు 1100 రూపాయలకు పైగానే ఉన్నాయి . అంతేకాదు ఐదు రసం పౌడర్ ప్యాకెట్స్ 1200 చూపిస్తున్నాయి . ఇక ఉప్మా ప్యాకెట్స్ అయితే 1100 పైగానే చూపిస్తున్నాయి . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు కాస్ట్ పెడితే అందరూ తిడుతున్నారు. మరి అత్తమ్మస్ కిచెన్ వాళ్ళు అంత కాస్ట్ లు పెడితే ఎవరు రియాక్ట్ అవ్వరా ..? అంటూ కొంతమంది జనాలు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ పేరు సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండ్ అవుతుంది . ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతున్నారు..!