కాంతార మూవీ తో కన్నడ నటుడు డైరెక్టర్ నిర్మాత అయినటువంటి రిషబ్ శెట్టి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఒక్క సినిమాతో ఈయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతోంది. ప్రస్తుతం ఈయన కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి కూడా ఈయనే డైరెక్షన్ చేస్తున్నారు ఈయనే హీరోగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు 500 కోట్ల వరకు పెట్టడానికైనా రెడీగా ఉన్నారట. అంతేకాదు ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోహీరోయిన్ గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోలో ఓ హీరోయిన్ ని పొగుడుతూ మరో హీరోయిన్ ని అవమానిస్తూ రిషబ్ శెట్టి చేసిన కామెంట్లు ఆ హీరోయిన్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి. మరి ఇంతకీ రిషబ్ శెట్టి ఏ హీరోయిన్ ని అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం. 

కన్నడ నటుడు డైరెక్టర్ అయినటువంటి రిషబ్ శెట్టి అదే కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్నా కి మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే రష్మిక రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కిర్రిక్ పార్టీ మూవీ ద్వారానే సినిమాల్లోకి వచ్చింది. కానీ అలాంటిది తన ఫస్ట్ సినిమా పేరు చెప్పుకోడానికి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇష్టపడలేదట. అయితే ఓ ఇంటర్వ్యూలో కోట్ సైగలతో ఈ హీరోయిన్ చేసి తన మొదటి సినిమా పేరు చెప్పకపోవడంతో ఆ మధ్యకాలంలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవ్వడమే కాకుండా కన్నడలో ఈ హీరోయిన్ ని నిషేదించాలి అనేదాకా వచ్చారు. అలాగే కాంతార సినిమా చూడలేదు అని చెప్పడంతో కూడా రష్మిక ట్రోలింగ్ కి గురైంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి పాల్గొన్న సమయంలో మీకు సాయి పల్లవి, కీర్తి సురేష్, సమంత,రష్మిక వీరందరిలో ఎవరంటే ఇష్టం అని అడగగా నాకు సాయి పల్లవి నటన ఇష్టం అలాగే సమంత అంటే ఎక్కువ ఇష్టం.

కానీ మీరనుకుంటున్నట్లు ఈ తరహా హీరోయిన్ లు నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఎలా అయితే కోట్ సైగలతో చెప్పిందో అచ్చం అలాగే రిషబ్ కూడా కోట్ సైగలతో రష్మిక ని ఇమిటేట్ చేయడంతో రిషబ్ శెట్టి చెప్పింది రష్మిక గురించే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు రష్మిక ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. కానీ గతంలో రష్మిక ఎలా చేసిందో ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా అలాగే చేశారని చాలామంది రిషబ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ..సమంత అనారోగ్యం బారిన పడ్డ సమయంలో నేను చాలా ఫీల్ అయ్యాను.ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకోచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: