అందుకే ఏం మాట్లాడినా.. ఏం చేసినా ఆచితూచి మాట్లాడాలి .. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటూ ఉంటారు ఇంట్లోని పెద్దవాళ్ళు.  క్రేజ్ వచ్చింది కదా అని టంగ్ స్లిప్ అయితే మాత్రం అంతకు డబల్ రేంజ్ లోనే పాతాళానికి పడిపోయే రేంజ్ లో ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేసింది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య . వైష్ణవి చైతన్య ఒక యూట్యూబర్. ఎంత కష్టపడి పైకి ఎదిగింది అన్న విషయం అందరికీ తెలుసు.  బేబీ మూవీతో భారీ క్రేజ్  సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ప్రెసెంట్ సిద్దు జొన్నలగడ్డతో ఒక సినిమాలో నటించింది . బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.


మూవీ ఏప్రిల్ 10వ తేదీ రిలీజ్ కాబోతుంది . వైష్ణవి చైతన్య తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది . ఈ క్రమంలోనే స్టేజి మీదనే ఆమె తన పరువు పోగొట్టుకున్నంత పని చేసింది . మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రమోషన్స్ బాగా స్పీడ్ అప్ చేశారు మూవీ టీం. ఏపీలోని భీమవరం - రాజమండ్రి ప్రాంతాలకు మూవీ టీం వెళ్లి సందడి చేసింది . అయితే భీమవరం ఈవెంట్ కు వచ్చిన వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఫ్లోలో టంగ్ స్లిప్ అవుతూ "రాజమండ్రి కి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ మాట్లాడింది ".



దీనితో అక్కడికి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు అరవడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న హీరో సిద్దు అలర్ట్ అయ్యాడు.  ఇది భీమవరం అంటూ వైష్ణవికి చెప్తాడు . అంతే దాంతో వెంటనే ఆమె ఓ షట్ అంటూ ఒక బూతు పదం కూడా వాడుతుంది. ఇదంతా అక్కడ రికార్డు అయిపోయింది.  అంతేకాదు అక్కడ ఉండే జనాలు షాక్ అయిపోయారు . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రోలింగ్ కి గురవుతుంది. లిప్ స్టిక్ రాసుకొని మేకప్ లు వేసుకుంటే సరిపోతుందా? ఎక్కడికి వచ్చాము అనేది తెలియదా..? అంటూ దారుణ అతి దారుణంగా ఆమె గురించి మాట్లాడుతున్నారు . మొత్తానికి వైష్ణవి చైతన్య బాగా సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: