ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలతో పాటు ప్రజలకు అవసరమైన ఆరోగ్యశ్రీ కూడా అట్టకెక్కిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల్లోనే రెండుసార్లు ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది. ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు న్యాయకత్వం పైన విమర్శిస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.



షర్మిల ఇలా రాసుకోస్తూ.."పేరుకేమో రైజింగ్ స్టేట్ కానీ ఇక్కడ వైద్య సేవలకే దిక్కులేదు.. పేదవారి ఆరోగ్యానికి రాష్ట్రంలో అసలు భరోసానే లేదు.. ప్రజల ఆరోగ్యం పైన కూటమి ప్రభుత్వాన్ని అంతులేని నిర్లక్ష్యం అంటూ ఫైర్ అయ్యింది.ఆరోగ్యశ్రీ సేవలు కింద 3500 కోట్లు పెండింగ్ పెట్టడం ఇది చాలా సిగ్గుచేటు అంటూ వెల్లడించింది.. గడిచిన తొమ్మిది నెలలుగా ఎలాంటి బకాయిలు విడుదల చేయకుండా పేదలకు అవసరమైన వైద్య సేవలు ఆపేయడం.. కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది అంటూ ప్రతి పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా టీడీపీ, జనసేన, బిజెపి చేస్తోందంటూ ఆమె ఆరోపించింది.


కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుంచి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది అంటూ పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందంటూ షర్మిల రాసుకొచ్చింది. ఆరోగ్య శ్రీ నిధులు ఏ ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టిన కూడా కచ్చితంగా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోవాలని తెలిపింది. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని.. ఏపీలో వైద్య మందగ ఏ ఒక్కరు కూడా మరణించకూడదని ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వ హత్యలు కిందికే వస్తాయని హెచ్చరిస్తోంది షర్మిల. షర్మిల చేసిన ఈ పోస్ట్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి వీటి పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: