టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో రీసెంట్ గా విడుదలైన కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 14వ తేదీన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.... శ్రీదేవి, శివాజీ, హర్ష్ రోహణ్ కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. 


బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కోసం సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కోర్ట్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ వచ్చింది. కోర్ట్ సినిమాను ఏప్రిల్ 11న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. నాచురల్ స్టార్ హీరో నాని సమర్పించిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.


కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోనే విడుదల కాగా.... ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషలలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. లవ్ స్టోరీ,  పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది.

కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తిరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ. 57 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఎవరూ కూడా అనుకోలేదు. ఈ సినిమాకు ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంట నిర్మాతలుగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: