- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన ముద్దుల మావ‌య్య సినిమా 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1989 ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.. ఈ సినిమాలో బాలయ్య నటన గురుంచి ఎంత చెప్పిన తక్కువే..ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య నటన చుసిన ప్రేక్షకుల సినిమాకి బ్రాహ్మరధం పట్టారు. మావయ్య అన్న పిలుపు పాట అయితే ఇప్పటికి ఫంక్షన్స్ లో మారుమొగుతూనే ఉంటుంది. ఈ సినిమా ఎన్నో రికార్డుల‌కు నెలవుగా మారింది. ఒకే సంస్థలో ఒకే హీరోతో ఒకే దర్శకునితో వరుసగా నాలుగు 300 రోజుల చిత్రాలు రూపొందడం తెలుగు సినీ చరిత్ర లో ఓ అరుదైన అంశమైతే, ఈ తరహా రికార్డు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ భారత చలనచిత్ర చరిత్ర లోనే కనిపించలేదు.


ముద్దుల మావయ్య సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వ‌హించారు. బాలకృష్ణ, సీత, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాలకృష్ణను హీరోల టాప్ లీగ్‌లోకి తెచ్చి అతనికి యువరత్న అనే బిరుదు సంపాదించి పెట్టింది. చిత్రం తమిళ చిత్రం ఎన్ తన్గచి పడిచావాకి రీమేక్ గా తెర‌కెక్కింది. ఇది హిందీలో ఆజ్ కా అర్జున్ గా , కన్నడంలో రవిమామ గాను , బెంగాలీలో పబిత్రపాపీ గానూ పునర్నిర్మించారు.


సినిమా 61 కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 30 కేంద్రాల‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా క్లోజింగ్ షేర్ 5. 5 కోట్లు. సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో ఫ‌స్ట్ 5 కోట్ల షేర్ రాబ‌ట్టిన సినిమా గా కూడా ముద్దుల మావ‌య్య రికార్డుల‌కు ఎక్కింది. అలాగే ఫ‌స్ట్ వీక్ లో 1.16 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 100 రోజులు పూర్త‌య్యే స‌రికి ఈ సినిమా డ‌బుల్ మార్జిన్ కొల్ల‌గొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: