
ఇక అలాగే 2026 డిసెంబర్ చివరకు బన్నీ , అట్లీ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది .. అలాగే మహేష్ , రాజమౌళి సినిమా మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది .. ఇలా మొత్తం మీద ప్రభాస్ , అల్లుఅర్జున్ , ఎన్టీఆర్ , నాని , రామ్ చరణ్ అంటే ఐదు సినిమాలు రాబోతున్నాయి .. ఇవి కాక బాలయ్య నుంచి ఒకటి విజయ్ దేవరకొండ నుంచి ఒకటి కూడా వస్తాయి .. నాని ఏడాదికి ఒక సినిమా వదలరు మరోటి ఎలాగో వదులుతారు అంటే దాదాపు ప్రతి నెల నెలన్నరకు ఓ భారీ సినిమా ఈ రంగంలోకి దిగబోతుందన్నమాట ..
అయితే ఇవేమీ ప్లాన్డ్‌గా ప్రతి నెలకు నెలన్నరకు ఒకటి వంతున వదలరు .. అందువల్ల ఉంటే వరుసగా భారీ సినిమాలు లేదంటే చిన్న సినిమాలు అన్నట్టుగా ఉంటుంది సిచువేషన్ .. ఇక ఇప్పటికే రామచరణ్ పెద్ది , నాని ప్యారడైజ్ ఒకేసారి ఢీ కొట్టుకుపోతున్నాయి .. ఇదిలా ఉంటే మిండ్ రేంజ్ చిన్న హీరోల సినిమాలు ఉండనే ఉన్నాయి . అవి ఎలా లేదన్న కనీసం 20 వరకు ఉండే ఛాన్స్ ఉంది .. ఇలా మొత్తం మీద 2026 లో థియేటర్లకు టాలీవుడ్ లో పండగలా ఉండబోతుంది ..