ప్రముఖ సింగర్ జస్లీన్ కౌర్ రాయల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నెటిజన్స్ చేసిన ట్రోలింగ్ గురించి ఆమె స్పందించారు. ఈమె ఈ ఏడాది జనవరి నెలలో అహ్మదాబాద్ లో నిర్వహించిన కోల్డ్ ప్లే కన్సర్ట్ కి హాజరయ్యింది. ఆ కన్సర్ట్ లో జస్లీన్ కౌర్ రాయల్ సాంగ్స్ పాడింది. అయితే ఆ ప్రదర్శన తర్వాత ఆమెకి పాడటం రాదు అంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. అంతేకాకుండా ఆమె సింగర్ కాదని కూడా అన్నారు. దీంతో జస్లీన్ కౌర్ ఇటీవల ఒక మినీ డాక్యుమెంటరీ విడుదల చేశారు.

ఆ డాక్యుమెంటరీ ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ ట్రోలింగ్ కారణంగా ఒత్తిడికి గురయ్యాను. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతా' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొందరు కామెంట్స్ రూపంలో ఆమెకి దైర్యం చెప్తున్నారు. జస్లీన్ కౌర్ రాయల్ పంజాబ్ లోని లూధియానాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది. ఈమె తన స్కూలింగ్ మొత్తం అక్కడే చేసింది. ఆ తర్వాత ఈమె ఉన్నత చదువుల కోసం న్యూడిల్లీకి వెళ్లింది.

ఈమె హిందీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, అలాగే ఆంగ్లం భాషలలో కూడా పాటలు పాడింది. ఈమెకి ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటుగా ఇతర అవార్డులను కూడా సొంతం చేసుకుంది. జస్లీన్ రాయల్ షేర్ షా, బద్దాపూర్, గల్లీబాయ్ వంటి సినిమాలలో సాంగ్స్ పాడింది. ఈమె సోనమ్ కపూర్, ఫవాద్ ఖాన్ నటించిన ఖూబ్ సూరత్ సినిమా ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమెకి సంగీతంలో ఎటువంటి శిక్షణ లేకుండానే అర్హత సాధించి.. ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈమె గిటార్, మౌత్ ఆర్గాన్, ఫ్లూట్ అలాగే టాంబురైన్‌ లను వాయించగలదు. ప్రస్తుతం సింగర్ జస్లీన్ కౌర్ రాయల్ ముంబైలో నివసిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: