
సూర్య , వెంకీ అట్లూరి సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు నుంచి మొదలు పెట్టడానికి సూర్యా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది .. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ ముందుగా భాగ్యశ్రీ భోర్సే తీసుకునే ప్లాన్లో ఉన్నారని ఆ తర్వాత మరో హీరోయిన్ ‘కాయదు లోహర్’ను తీసుకుబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ప్లేస్ లోకి మరో గ్లామర్ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది .. కాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు .. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి ..
అయితే సూర్య గత కొంతకాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఎన్నో అంచనాలతో కంగువ సినిమాలో నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది .. ప్రస్తుతం సూర్య కెరియర్ ఎంతో డౌన్ ఫాల్ లో ఉంది .. ఇలాంటి సమయంలో వెంకీ అట్లూరి ఇలాంటి దర్శకుడు తో సూర్య సినిమా అంటే మూవీ పై మంచి అంచనాలే ఉంటాయి .. అలాగే వెంకీ అట్లూరి చేస్తున్న సినిమాలు కూడా ఎంతో డిఫరెంట్గా ప్రేక్షకులను ఎంతగానో మెపిస్తున్నాయి .. ఇక ఇప్పుడు సూర్యా తో చేయబోయే వెంకి అట్లూరి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందనేది కూడా ఎంతో హట్ టాపిక్ గా మారింది.