త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశాడు ఒక తెలుగు హీరో . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేలేదు . మాటల మాంత్రికుడు ..ఎంత వినసొంపుగా ఉంటుందో ఆయన రాసే డైలాగ్స్. ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు.  ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రాసే డైలాగ్ కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు .


కాగా గుంటూరు కారం సినిమా తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రజెంట్ బన్నీతో ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా హాల్డ్ లో పడింది . ఎందుకంటే బన్నీ - అట్లీ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు . ఇప్పుడు త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు . అయితే ఈ మధ్య గ్యాప్ లోనే రామ్ పోతినేని ఒక లవబుల్ లవ్ స్టోరీ తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యాడు అని వార్తలు వినిపించాయి. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది

.

సినిమా కోసం రామ్ పోతినేనికి ఎక్కువ కండిషన్స్ పెట్టడమే దానికి కారణం అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . రాంపోతినేనికి ఫ్లాప్స్ లేవు కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది.  మరి అలాంటి హీరోకి లేనిపోని కండిషన్స్ పెడితే ఒప్పుకుంటారా ..? అందుకే సినిమానే వదులుకునేసాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి టైం ఇలా బ్యాడ్ గా మారిపోయింది ఏంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..??

మరింత సమాచారం తెలుసుకోండి: