
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబోలో ‘ నాన్నకు ప్రేమతో ’ సినిమా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సినిమా బాగానే ఉంది. 2016 సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాల పోటీలో వచ్చి కూడా బాగా ఆడింది. అయితే ఎక్కడో చిన్న వెలితి ఉంది. ఈ సినిమా మాస్ సినిమా కాదు.. క్లాస్ సినిమాగా తెరకెక్కింది. ఎన్టీఆర్‌కు క్లాస్ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. ఇప్పటకీ నాన్నకు ప్రేమతో సినిమాను టీవీల్లో చూస్తుంటే మంచి సినిమా అనిపిస్తుంటుంది.. కానీ ఎన్టీఆర్ పూర్తి స్టామినా ను సుకుమార్ పూర్తి స్థాయిలో వాడుకోలేదు.. ఎన్టీఆర్ లో ఉన్న మాస్ హీరోను యూజ్ చేసుకోలేదు. ఆ విషయం సుకుమార్ కు కూడా తెలుసు. అందుకే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు సుకుమార్ రేంజ్ మారిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప 1 - పుష్ప 2 సినిమా లతో సుకుమార్ అంటే నేషనల్ వైడ్ గా పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరూ కలుసుకొన్నారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ఎన్టీఆర్ - సుక్కు క్రేజీ ప్రాజెక్టు పై చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరు కూడా ఓ ప్రైవేటు పార్టీలోనే కలిశారు. అక్కడ రామ్ చరణ్ పుట్టిన రోజు జరుపుకున్నాడు.
ఇక సుకుమార్ విషయానికి వస్తే ఇప్పుడు సుకుమార్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండాలి. చరణ్ బుచ్చిబాబు సానాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ - చరణ్ సినిమా ఉంటుంది. ఈ లోగా ఎన్టీఆర్ తన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే అప్పుడు సుక్కు - ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లాలంటే కనీసం 4 ఏళ్లు ఆగాలి.