Rx -100 చిత్రంతో ఫస్ట్ టైమ్ తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి కూడా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మహాసముద్రం సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో మళ్లీ మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాతలకు కూడా లాభాలను తెచ్చిపెట్టాయి.


పాయల్ అద్భుతమైన నటనకు మంగళవారం సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది.ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చివరిలో చూపించారు. అనుకున్నట్టుగానే డైరెక్టర్ మంగళవారం -2 సినిమాని  తీయడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పొందిన మంగళవారం సినిమా ఫ్రీక్వెల్ అన్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ కథ అక్కడితో ఎండింగ్ అయిపోయిందని అందుకే ఫ్రీక్వెల్ అయితే కథ చెప్పడానికి చూపించడానికి బాగుంటుందనే విధంగా డైరెక్టర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేశారని త్వరలోనే సినిమా షూటింగ్ను కూడా మొదలుపెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంగళవారం ఫ్రీక్వెల్ కి ఉన్న బజ్ వల్ల బాలీవుడ్ లో కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం అయ్యిందట. మంగళవారం 2 చిత్రానికి సంబంధించి ఈ సినిమాలో హర్రర్ ఎలివేషన్స్ తో పాటుగా డివోషనల్ టచ్ ని చేయబోతున్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి వెల్లడించారట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి జోనర్లో తెరకెక్కించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. అయితే హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ త్వరలోనే పుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: