అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం.. చిన్నతనంలోనే సిసింద్రీ గా ఎంతగానో అలరించిన అఖిల్ ప్రస్తుతం హీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా ప్లాప్ అయినా నిరుత్సాహపడకుండా ప్రేక్షకులని మెప్పించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు కానీ అఖిల్ కి అదృష్టం కలిసి రావడం లేదు.. అఖిల్ కెరీర్ లో డీసెంట్ హిట్ మూవీ ఏదైనా ఉందంటే అది బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.. మాస్ ఇమేజ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న అఖిల్ స్టార్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో “ ఏజెంట్ “ అనే భారీ బడ్జెట్ మూవీలో నటించాడు.. మలయాళం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది..

ఏజెంట్ ప్లాప్ తో అఖిల్ రెండేళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులని మెప్పించాలని అఖిల్ చూస్తున్నాడు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు తో అఖిల్ సినిమా సెట్ చేసుకున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించనున్నారు. నందు మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఆడింది, దీంతో సెంటిమెంట్‌గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుందని తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ పై నిర్మాత నాగవంశీ కీలక అప్‌డెట్ ఇచ్చాడు.ఈ మధ్యకాలంలో హీరోల పుట్టినరోజుకు వారి కొత్త సినిమాల నుంచి కచ్చితంగా ఇంట్రస్టింగ్ అప్‌డెట్ ఇవ్వడం కామన్ గా వస్తుంది.. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా '#Akhil 6’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో అఖిల్ చేయి మాత్రమే చూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: