
కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో అయ్యప్పనన్ కోషియాన్ అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమిక్ చేశారు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా నటించారు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్న సమయంలో ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటుంది అని ఆయనకు ఆ సినిమాను చూపించి , ఆ పాత్రలో నటించండి సార్ అని అడిగాడట. దానితో బాలకృష్ణ మూవీ సూపర్ గా ఉంది. అలాగే నువ్వు నన్ను చేయమన్న పాత్ర కూడా బాగుంది. కానీ ఆ పాత్ర నాపై సెట్ కాదు. పవన్ కళ్యాణ్ తో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడట. దానితో నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ ను ఆ పాత్ర కొస్ సంప్రదించగా ఆయన ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక భీమ్లా నాయక్ మూవీ అద్భుతమైన విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.