
పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ మాత్రం ఏడాదికి ఓ రెండు చిత్రాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మహేష్ బాబు 29వ సినిమా చేస్తూ ఉన్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ మాత్రం తన కుమారుడు చేసిన అన్ని చిత్రాలు కేవలం రెండేళ్లలోనే చేశారు. ఈ విషయం నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి ఒకసారి కొత్త రికార్డును సృష్టించారు.
కృష్ణ తనకు 20 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సుమారుగా 350 చిత్రాలలో నటించారు. హీరో గానే కాకుండా నిర్మాతగా డైరెక్టర్ గా కూడా మంచి పేరు సంపాదించారు. కృష్ణ 1972లో ఏకంగా 18 సినిమాలను విడుదల చేశారు.. సినిమాల లిస్టు విషయానికి వస్తే..
1). రాజా మహల్
2). అంతా మనమంచికే.
3). మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త
4). గూడుపుఠాణి
5). మేనకోడలు
6). కోడలు పిల్ల
7). మావూరి మొనగాళ్లు
8). భలే మోసగాడు
9). పండంటి కాపురం
10). హంతకులు దేవాంతకులు
11). ప్రజా నాయకుడు
12). నిజం నిరూపిస్తా
13). మరపురాని తల్లి
14). కత్తుల రత్తయ్య
15). మా ఇంటి వెలుగు
16). ఇల్లు ఇల్లాలు
17). అబ్బాయిగారు అమ్మాయిగారు
18). ఇన్స్పెక్టర్ భార్య
ఇలా ఒక ఏడాదిలోనే 18 సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా ఇందులో 80% వరకు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇక పండంటి కాపురం సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చిందట. ఇప్పటికీ ఇన్నేళ్లు అవుతూ ఉన్న ఈ రికార్డుని బ్రేక్ చేయలేదు ఎవరు.