బాలీవుడ్ నటి దియా మీర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై గత కొద్ది రోజుల నుంచి అనేక రకాల గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 4 ఎకరాలలో ఉన్న అడవిని, అందులో ఉంటున్న జంతువులను, మొక్కలను తొలగించడంపై తెలంగాణలో విపరీతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. 400 ఎకరాలలో విస్తరించి ఉన్న అడవిని, అందులో ఉండే జంతువులను, మొక్కలను తొలగించడంపై తెలంగాణలో పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్నాయి.


ఈ భూమిని రక్షించడం కోసం విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్య మానవులు సైతం వారి మద్దతును తెలుపుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం పైన ప్రతి ఒక్క సినీ నటీనటులు స్పందిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల వ్యవహారంపై నటి బాలీవుడ్ నటి దియా మీర్జా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవుతున్నారు.


నటి దియా మీర్జా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములు, అందులో ఉండే జంతువులు, మొక్కలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోపై చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ భూముల వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో జంతువులు తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెత్తుతున్న దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి మనసు తరించిపోతుంది.

అయితే ఈ వీడియోలు అన్ని నకిలీ ఏఐ ఫోటోలు, వీడియోలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే దీనిపై నటి దియా మీర్జా స్పందిస్తూ... నేను పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు ఒరిజినల్ వీడియోలు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. ఇటువంటి వాదనలు చేసే ముందు తెలంగాణ ప్రభుత్వం, మీడియా వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి అని దియా మీర్జా తన ఎక్స్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం దియా చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: