టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారు నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో నటి సంయుక్త మీనన్ ఒకరు. ఈ చిన్నది బింబిసార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న సంయుక్త వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. 

ఈ చిన్నది నటిస్తున్న తాజా చిత్రం నారి నారి నడుమ మురారి. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా.... సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.... అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమాలోని సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో శర్వానంద్, సంయుక్త మీనన్ మధ్య రొమాన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వీరిద్దరూ కూడా ఘాటు రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయి మరి నటించారు. 


అంతేకాకుండా ఈ పాటలో శర్వానంద్ లవర్ బాయ్ గా కనిపిస్తూ హీరోయిన్ సంయుక్త మీనన్ చుట్టే తిరుగుతూ ఉన్నాడు. అంతే కాకుండా ఆమెతో ల్యాబ్ లో రొమాన్స్ చేస్తున్న సీన్లు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా, ఈ పూర్తి పాటను ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మినీ టీజర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలను పెంచేసింది. ఈ వీడియో చూసిన చాలామంది ఇద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగిపోయారని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఇంత రెచ్చిపోయి రొమాన్స్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి శర్వానంద్, సంయుక్త మీనన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: