పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని హీరోగా పేరు సంపాదించారు. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనకి ఎదురు లేదు అనిపించుకున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేవలం సాధారణ అభిమానులే కాకుండా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే నటులు కూడా ఫ్యాన్స్ గా ఉంటారు. ఆయనను ఎంతోమంది అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. అలా పవన్ కళ్యాణ్ ను ప్రాణంగా ఇష్టపడే  నటి ఆషురెడ్డి..సోషల్ మీడియా ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఆషురెడ్డి   బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత  తన క్రేజ్ మరింత పెంచుకుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ను ఎంతో అభిమానించే ఈమె తన ఒంటిపై పవన్ కళ్యాణ్ టాటూ కూడా వేయించుకుంది. అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

 హరహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్క సెట్ లో తన హ్యాపీడేస్ మూవీ షూటింగ్ జరుగుతుందని అన్నది. ఎలాగైనా ఆరోజు పవన్ కళ్యాణ్ ను కలవాలి అని ఫిక్స్ అయిపోయి ఆయన షూటింగ్ అయిపోయే వరకు వెయిట్ చేశానని చెప్పింది. అలా పవన్ ను కలవడానికి వెళ్లి అక్కడ వెయిట్ చేస్తున్నామని పవన్ కు తెలిసి మమ్మల్ని రమ్మన్నారు. వెంటనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లగానే ఓహో నువ్వేనా నా టాటూ వేయించుకుంది అంటూ పవన్ కళ్యాణ్  అడిగారు. ఆయన నన్ను గుర్తు పెట్టుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంతే కాదు అక్కడే కూర్చోబెట్టుకొని టీ తెప్పించారు.

పవన్ సార్ టీ తాగుతుంటే నేను మాత్రం ఆయననే చూస్తూ ఉండిపోయాను. ఈ టైం లోనే  సార్ మీరు ఖుషి మూవీలో భూమిక నడుము చూడడం  నాకు నచ్చలేదు అని చెప్పాను. వెంటనే పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వి, నడుము కాకుండా నీ చేతిపై టాటూ ను చూస్తానని పవన్ చెప్పుకోచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను  ఆమె కలిసి ఎంతో ఆనందపడ్డారు. ఇక చివరి సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెకు ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. నన్ను కలవాలనుకునేటప్పుడు జాగ్రత్త.. నేను ప్రతిసారి ఈ మూడ్ లో ఉండను.. కాస్త జాగ్రత్తగా ఉండమని అషు రెడ్డి కి పవన్ కళ్యాణ్ సరదాగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ఆమె తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: