రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో చేసిన కాంతారా మూవీ 2022 సెప్టెంబర్ 30న వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 450 కోట్లు కొల్లగొట్టింది.ఇక 16 కోట్ల బడ్జెట్ కి 450 కోట్ల కలెక్షన్లు అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.కన్నడలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలై ఆ ఇండస్ట్రీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..మనశ్శాంతి లేదని ఒక రాజు అడవులు పట్టుకుని తిరుగుతూ ఉండగా పంజుర్లి దేవత కనిపిస్తుంది. ఇక పంజుర్లి దేవతని నా ఇంటికి తీసుకు వెళ్తాను అని అడిగితే పంజుర్లి దేవత  అడవిలో ఉండే ఓ వ్యక్తిలోకి ప్రవేశించి ఈ ప్రజలకి ఈ భూమి ఇచ్చేయ్.. నువ్వు నన్ను ఇంట్లో పెట్టుకో అని చెబుతుంది.

ఆ తర్వాత రాజు వారికి భూమిని రాసిచ్చి దేవతను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటాడు.ఆ తర్వాత రాజు తర్వాత తరంలో ఉండే వ్యక్తికి ఆ భూమిపై కన్ను పడి దాన్ని కోరుకుంటాడు.అలా పంజుర్లి దేవత ఓ వ్యక్తిలో ప్రవేశించిన సమయంలో నాకు భూమి కావాలి అని అడిగినప్పుడు ఆ దొర కోర్ట్ మెట్ల మీద రక్తం కక్కుకొని పడి చచ్చిపోతాడు అని దేవత చెబుతోంది. అయితే ఆ తర్వాత అచ్చం పంజుర్లి దేవత చెప్పినట్టే ఆ దొర కోర్టు మెట్ల మీద రక్తం కక్కుకొని పడి చచ్చిపోతాడు. ఆ తర్వాత తరం వచ్చిన సమయంలో విలన్ ముందు నుండి భూమిని లాక్కోవాలి అనే ఆలోచనతోనే ఉంటాడు. ఇక సినిమా అలా నడుస్తున్న సమయంలో చివర్లో పంజుర్లి దేవత ప్రవేశించి హీరో సోదరుడు పాత్ర నీ హతం చేస్తాడు. అయితే ఇక్కడే ఓ మిస్టేక్ ఉంది అని సినిమా విడుదలైన ఇన్ని రోజులకి గుర్తుపట్టారు.

అదేంటంటే పంజుర్లి దేవత ఏ వ్యక్తిలో కైతే ప్రవశిస్తుందో ఆ వ్యక్తి భూమి మీద ఆశపడ్డ దొర కోర్ట్ మెట్ల మీద రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అని చెబుతారు. కానీ మళ్లీ భూమిపై ఆశపడ్డ దొర భూమి కోసమే ఇక్కడికి వచ్చాడని,మీ అందరికీ ఆయన వల్ల అపాయము ఉంది అని ఎందుకు చెప్పలేదు.. ఆ దొర నిజస్వరూపం పంజుర్లి దేవత ముందుగానే బయట పెడితే అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండేవారు కదా.ఆ దొర చనిపోతాడు అని చెప్పినప్పుడు ఈ దొర నిజ స్వరూపం ఎలాంటిదో కూడా పంజుర్లి దేవత చెప్పాలి కదా..డైరెక్టర్ ఈ పెద్ద మిస్టేక్ ఎలా పెట్టారు అంటూ సినిమా విడుదలైన ఇన్ని రోజులకి ఈ మిస్టేక్ ని దొరకపట్టారు నెటిజన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: