
కరాటే కళ్యాణి మాట్లాడుతూ ఈరోజు ఉదయం నుంచే తనకు ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని.. నాటి హేమ మీకు నోటీసులు పంపించిందంట కదా అని చాలామంది అడుగుతున్నారు.. అవును నాకు నోటీసులు అందాయి వాటిని తీసుకున్నాను.. నాకు అబద్దాలు చెప్పడం రాదు?. తాను ఎక్కడ ఉన్నాను.. ఏమిటి అన్న విషయాలను కూడా పూర్తిగా విషయాలను వీడియో ద్వారా తెలియజేసింది. కరాటే కళ్యాణి ప్రస్తుతం తన సొంత ఊరు అయిన విజయనగరంలో ఉండడం వల్లే తాను ఎవరికి కాల్స్ స్వీకరించలేకపోతున్నాను అంటే తెలియజేసింది. హేమ పంపించిన నోటీసులు తీసుకొని తాను తన పని చేసుకోవడానికి వచ్చాను అంటూ తెలిపింది.
నేను కూడా లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. హేమకు కూడా రిప్లై ఇస్తాను.. కేవలం తాను మీడియాలో వచ్చినటువంటి ప్రచారము వార్తలను మాత్రమే మాట్లాడాను వ్యక్తిగతంగా తనకు ఎలాంటి కక్ష లేదని.. ఒకవేళ పర్సనల్గా నాకు హేమ పైన కోపం ఉంటే ఖచ్చితంగా మా అసోసియేషన్ హేమను సస్పెన్స్ చేయగా వాటిని తీసివేయాలంటూ ఓటు వేశానంటూ తెలియజేసింది.నా మీద రూ .5కోట్ల రూపాయల వరకు పరువు నష్ట పరిహారం వేసిందని.. నేను కూడ లీగల్ నోటీసుల పైన ఫైట్ చేస్తాను ఎక్కడ తగ్గేదే లేదంటూ వెల్లడించింది కరాటే కళ్యాణి. మొత్తానికి హేమకు ఇలా రిప్లై ఇచ్చింది.