హీరోయిన్ గా తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. అయితే సరైన సినిమాలు పడలేక ఈమె ఈ మధ్యకాలంలో కొంతమేరకు వెనక్కి పడిపోయింది. హీరో విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాలో నటించిన ఈమెకు పెద్దగా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఈ మధ్యనే పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకున్న తర్వాత కూడా సరైన అవకాశాలు అందుకోవడంలో విఫలమయ్యింది.


ఇటివలె ఇమే షాకింగ్ విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. ప్రియాంక మొదట చిన్న షార్ట్ ఫిలిమ్స్ లలో నటిస్తున్న సమయంలో తనకు టాక్సీవాలా సినిమాలో అవకాశం వచ్చిందని.. అయితే అలా వచ్చిన అవకాశాన్ని తాను నమ్మలేకపోయానని వెల్లడించింది. ముఖ్యంగా గీత ఆర్ట్స్ బ్యానర్ వంటి వాటిపైన అవకాశం రావడంతో పాటుగా హీరో విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం అంటే కొద్ది రోజులపాటు తాను నమ్మలేకపోయానని వెల్లడించింది. ఇలా నటిస్తున్నాననీ అవకాశం వచ్చిందని ఎవరికైనా చెప్పాలి అనుకుంటే మధ్యలో తీసేస్తారేమో అని భయం కూడా తనకి ఉందని తెలిపింది.


ఛాన్స్ వచ్చినట్టు అందుకే ఎవరికీ చెప్పలేదని.. అయితే కొద్ది రోజులు తర్వాత షూటింగ్ జరిగి కొంతమేరకు జరిగినప్పుడు తనకు నమ్మకం కలిగి ఆ తర్వాత తన ఇంట్లో కూడా తాను సినిమాలో నటిస్తున్నానని చెప్పానని..టాక్సీవాలా సినిమాలో తనని తాను చూసుకొని చాలా ఆనందపడ్డానంటూ తెలియజేసింది. ఎస్సార్ కళ్యాణ మండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియాంక ఆ తర్వాత  ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు.. ఇక ఈ మధ్యకాలంలో అడబపా దడపా చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే ఈమె చేతిలో  రెండు సినిమాలు ఉన్నాయట. అయితే అది హీరోయిన్గా లేకపోతే పలు సినిమాలలో పాత్రల అన్న విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: