థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తారు. అయితే ఈ వారం థియేటర్ లో ఒక్కరోజే చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..  బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ హీరోగా నటించిన జాట్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ లుగా సయామీ ఖేర్‌, రెజీనా నటించారు.

అలాగే స్టార్ హీరో అజిత్, త్రిష నటించిన 'పట్టుదల' సినిమా సందడి చేయనుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ఒక యాక్షన్ కామిడీ మూవీ. ఈ సినిమాలో అజిత్ లుక్స్ మామూలుగా లేవు.. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో హీరోగా స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేస్తుంది. జాక్ కొంచెం క్రాక్ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. జాక్ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచుతుందని సమాచారం.

థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రేక్షకులు అలరిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: