
కాగా ఇప్పుడు ఇండస్ట్రీలు తమన్న పేరు మారుమ్రోగిపోతుంది . స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తుంది . డేటింగ్ కూడా చేస్తుంది . ఈ విషయాన్ని వీళ్ళు అఫీషియల్ గా ఒప్పుకున్నారు . కానీ ఏమైందో ఏమో కానీ సడన్గా వీళ్ల మధ్య దూరం పెరిగింది అని తమన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే నటుడుతో క్లోజ్ గా ఉంటుంది అని.. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసింది అని బాలీవుడ్ - టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి .
ఈ వార్తలు పై తమన్న రియాక్ట్ కాకపోవడం కూడా పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తమన్న తన ప్రేమ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది. "విజయ్ వర్మతో త్వరలోనే నా పెళ్లి ఉంటుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ". దీనితో తమన్న ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. బ్రేకప్ అయిపోతుంది అన్న దాన్నీ నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావా..? అంటూ కొంతమంది సెటైరికల్ గా కామెంట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం తమన్నా తీసుకున్న డెసీషన్ గుడ్ అంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు తమన్నా పెళ్లి వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!