సమంత ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సమంత బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. తన నటనకు గాను సమంత ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

తన సినిమాల ద్వారా పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం సమంత నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కలిసి ఉన్న ఈ జంట ఏవో అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సమంత ఎప్పటిలాగే వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. నాగచైతన్య మరో అమ్మాయిని వివాహం చేసుకున్నప్పటికీ సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంది.

ఇక సమంత కూడా త్వరలోనే మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీ కి చెందిన ఓ వ్యక్తి తో ప్రేమలో ఉందని, అంతేకాకుండా త్వరలోనే అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సమంత మళ్లీ వివాహం చేసుకుంటే తన లైఫ్ చాలా సంతోషంగా ఉంటుందని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య మీద రివేంజ్ తోనే సమంత మరో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందని అనేక రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: