తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రవితేజ ఒకరు. రవితేజ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న వేషాల్లో కూడా అవకాశాలను దక్కించుకున్నాడు. అలా అయిన నటించిన చిన్న వేషాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకోవడం తో ఆ తర్వాత ఈయన కు సినిమాల్లో హీరోగా అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. ఇక హీరోగా నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలం లోనే రవితేజ కు హీరో గా కూడా మంచు గుర్తింపు వచ్చింది.

దానితో ఈయన ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గ్రేస్ కలిగిన నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ సమయం లో భారీ విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ జనాల నుండి , విమర్శకుల నుండి మాత్రం వచ్చింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాను కూడా థియేటర్లలో మళ్లీ రి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt