కోలీవుడ్ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్రమ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలలో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే విక్రమ్ తాజాగా వీర ధిర శుర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

11 రోజుల్లో ఈ సినిమాకు తమిళ నాడు ఏరియాలో 36.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  2.50 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 3.50 కోట్లు , ఓవర్ సీస్ లో 15.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 28.50 కోట్ల షేర్ ... 58.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 7.50 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: