
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెగిటివిటీ ఎంత పెరిగిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా ఏ స్టార్ సెలబ్రెటీ ఫోటో పెట్టిన ఏ స్టార్ సెలబ్రెటీకి సంబంధించిన వార్త బయటకు వచ్చిన పక్క హీరోల ఫ్యాన్స్ నెగిటివ్ గా ట్రోల్ చేయడం పనిగా పెట్టేసుకున్నారు . మరి ముఖ్యంగా రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది . ఎందుకో తెలియడం లేదు కానీ ఒకప్పుడు పాలు నీళ్లు లా ఉన్న ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఉప్పు నిప్పులా చిటపటలాడుతున్నారు .
దానంతటికి కారణం పుష్ప 2 అంటున్నారు కొంత మంది జనాలు. మరి కొంత మంది అసలు ఈ ఇష్యూ లేవగొట్టిందే అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు అని.. పాస్ట్ ని గుర్తు చేసుకున్నారు . రీసెంట్గా రాంచరణ్ నటించిన "పెద్ది" సినిమా షార్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది . ఈ షార్ట్ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ ఏ రేంజ్ లో వినపడుతున్నాయో నెగిటివ్ కామెంట్స్ కూడా అదే రేంజ్ లో వినపడుతున్నాయి .
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో "పెద్ది" సినిమా గురించి అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. "పెద్ది" ఫస్ట్ షార్ట్ అదిరిందిగా అంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు అల్లు శిరీష్". ఆయన చాలా ఫ్రెండ్లీగా హెల్తీ గా వీళ్ళని విష్ చేశారు . అయితే కొంతమంది మాత్రం ఘాటుగాటుగా రిప్లై ఇస్తున్నారు . ఏంటి మీ అన్నకు చేసిన అవమానం మర్చిపోయావా..? అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఏంటి మెగా ఫ్యామిలీ నిన్ను కూడా ఖోనేసిందా..? అంటూ దారుణంగా ఘాటుగా మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు అని పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే రేంజ్ లో వైరం పెరిగిపోయిందని మాట్లాడుకుంటున్నారు..!