టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతున్న డిజె టిల్లు విజయంతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ మూవీ ని రూపొందించారు. ఈ మూవీ లో కూడా సిద్ధూ హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సిద్దు క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇకపోతే వరుసగా డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సిద్దు తాజాగా జాక్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ వచ్చింది అనే విషయాన్ని కూడా ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. 

అసలు విషయం లోకి వెళితే ... జాక్ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే వరుస విజయాల తర్వాత సిద్దు నటిస్తున్న మూవీ కావడంతో జాక్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా ఏ  స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: