
అయితే వంశీ అనుచరులు ప్రస్తుతం నేపాల్ లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొమ్మా కోటేశ్వరరావు, మరి కొందరు నేపాల్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులు ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్లు జిల్లా జైలులో ఉన్నారు.
ఈ కేసులో ఏ5 గా ఉన్న రంగా అనే వ్యక్తిని మాత్రం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ వ్యక్తిని పీటీ వారెంట్ పై కోర్టులో హాజరు పరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఏలూరులో సీఐడీ బృందానికి రంగా దొరికిపోయారు. నిందితులలో కొందరు శ్రీకాకుళం వైపు పారిపోయారని తెలుస్తోంది. నేపాల్ లో తల దాచుకున్న వ్యక్తులు వాళ్ల సన్నిహితులకు ఫోన్ చేసి కేసు వివరాలను తెలుసుకుంటున్నారని భోగట్టా.
నలుగురు నిందితులు నేపాల్ లో ఎక్కడ ఉంటున్నారో ఆరా తీసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ ఈ కేసు నుంచి బయటపడటం తేలిక కాదని కామెంట్లు వీపిస్తున్నాయి. వల్లభనేని వంశీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ అరెస్ట్ ఆయన ఫ్యాన్స్ ను మాత్రం బాధ పెడుతోంది.