టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా జాక్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా ... కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగించిన దర్శకులలో ఒకరు అయినటువంటి బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన తేదీ.. వేదికను ఖరారు చేస్తూ ఒక అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా జాక్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 8 వ తేదీన ఆవాస హోటల్ , హైదరాబాద్ లో , సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: