అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య , అఖిల్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే చాలా సినిమాలలో నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఆ తర్వాత ఈయన కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు. ఈయన కెరియర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

సినిమా విడుదల అయిన చాలా రోజుల పాటు అఖిల్మూవీ ని ఓకే చేయలేదు. ఇకపోతే తాజాగా అఖిల్మూవీ ని ఓకే చేశాడు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు రానుంది. ఈ మూవీ కి లెనిన్ అనే టైటిల్ ను మేకర్స్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటిస్తారు అనేది తెలియాలి అంటే ఈ మూవీ బృందం అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: