అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత డెడికేషన్ గా ఉంటారో పుష్ప,పుష్ప -2 సినిమాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు.అయితే అల్లు అర్జున్ ఇప్పుడైతే హార్డ్ వర్కర్ గా మారారు కానీ చిన్నప్పుడు అంటే కాలేజీ చదువుతున్న సమయంలో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ కే వార్నింగ్ ఇచ్చేవారట. అవును మీరు వినేది నిజమే ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సామ్ జామ్ అనే షోలో బయటపెట్టారు.మరి ఇంతకీ అల్లు అర్జున్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు.. అల్లు అరవింద్ ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్పగాడి బర్త్ డేలు ఘనంగా జరుగుతున్నారు. పుష్ప-2 తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. దీంతో ఈరోజు అనగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

 అయితే అల్లు అర్జున్ బర్త్ డే అంటే కచ్చితంగా ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఓసారి సరిగ్గా మార్కులు రాకపోవడంతో ప్రిన్సిపల్ రూమ్ కి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చి రేపు మీ నాన్న రాకపోతే నువ్వు కాలేజీకి రాకు అని చెప్పారట. దాంతో ఈ విషయం అల్లు అరవింద్ కి బన్నీ చెప్పారట. దాంతో అల్లు అరవింద్ వీడు చేసిన తప్పుకు నాకు ఎన్ని తిట్లు పడతాయో అని కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్లారట.కానీ అక్కడికి వెళ్ళాక ప్రిన్సిపాల్ చాలా కూల్ గా మాట్లాడుతూ మార్కుల గురించి అంతగా పట్టించుకోకండి నెక్స్ట్ టైం చూసుకుందాంలే అంటూ మాట్లాడారట.

అయితే అక్కడ అల్లు అరవింద్ ఊహించుకున్న సీన్ ఒకటి జరిగింది మరొకటి.దాంతో ఇదేంటి ప్రిన్సిపాల్ ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు అనుకున్నారట.కానీ అల్లు అరవింద్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళకముందే బన్నీ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి ఇప్పుడు మా నాన్న దగ్గర మీరేమైనా ఎక్కువ తక్కువ చెబితే మీకు ఓ కూతురు ఉంది. ఆ కూతుర్ని లవ్ లో పడేసి లేపుకెళ్ళి మీ పరువు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇక ప్రిన్సిపల్ ఆలోచనలో పడి అసలే అల్లు అర్జున్ పెద్దింటి అబ్బాయి.. ఏమైనా చేయగలడు అని భయపడి అల్లు అరవింద్ కి ఒక్క మాట కూడా బన్నీ గురించి తప్పుగా చెప్పలేదట. ఇక ఈ విషయాన్ని అల్లు అరవింద్ సామ్ జామ్ షోలో సమంతకి చెప్పి నవ్వులు పుట్టించారు

మరింత సమాచారం తెలుసుకోండి: