ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో తమన్నా ఒకరు. ఈమె ఇప్పటి వరకు అనేక భాషల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇకపోతే తమన్నా తాజాగా ఓదెల 2 అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెలా అనే సినిమా రూపొందింది.

సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు మంచి ప్రేక్షకదరణ దక్కింది. ఇకపోతే ఆ తర్వాత కొంత కాలానికి ఓదెల 2 సినిమాను రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓదెలా 2 సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఈ సినిమాను ఏప్రిల్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన బిజినెస్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి తెలుగు థియేటర్ హక్కులు మరియు ఓవర్సీస్ థియేటర్ హక్కులతో కలిపి 10 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

లాగే ఈ మూవీ కి నాన్ థియేటర్ హక్కుల ద్వారా 18 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన తెలుగు సాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోయినట్లు అందుకు సంబంధించిన డిస్కషన్స్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తెలుగు సాటిలైట్ హక్కుల ద్వారా కూడా ఈ మూవీ కి పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాకు పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: