
అలాగే సక్సెస్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికీ తెలియదు . కానీ ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆపకూడదు .. అయితే అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో అదే చేశాడు .. తన కేరీర్ లో బద్రీనాథ్ , వరుడు వంటి సినిమాలు మినిమం స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లు నడుస్తున్న టైం లో కూడా దర్శకుడు త్రివిక్రమ్ తో జూలాయి , సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మళ్లీ బన్నీని ట్రాక్ లోకి తీసుకొచ్చాయి .. అలా మళ్లీ తిరిగి డీజే , సరైనోడు అంటూ మధ్యలో మాస్ విజయాలు కూడా అల్లు అర్జున్ ఖాతాలో పడ్డాయి .. అలాగే రేసుగుర్రం తో బన్నీ అందరికీ షాక్ ఇచ్చాడు అలా అక్కడి నుంచి బన్నీ రేంజ్ ఊహించని రేంజ్ కు వెళ్ళింది .
ఇక దీంతో ఎలా అయినా తన మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను అందుకోవాలని గట్టి సంకల్పంతో సుకుమార్ తో తన ప్రయాణం మొదలుపెట్టారు . అలా వీరిద్దరి కాంబోలో పుష్ప అనే సినిమా మొదలై ప్రభంజనం సృష్టించింది . ముందుగా పుష్ప 1న్ కి కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ రెండోభాగానికి మాత్రం బన్నీ ఇరగదీసాడు .. ఊహించని విధంగా పైగా లాభాలు అందుకున్నాడు .. ఇలా కెరియర్ బిగినింగ్ లో ఎన్నో విమర్శలు అందుకున్న అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతవరకు ఎవ్వరికి సాధ్యం కానీ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా అందుకున్నారు .. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ వంటి వారికే ఈ అవార్డు రాలేదు అలా బన్నీ జాతీయ ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడం టాలీవుడ్ కి ఎంతో గర్వకారణం అని కూడా అంటున్నారు ..