టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలు క్రితం ఆర్య 2 అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇకపోతే ఆర్య 2 మూవీ కంటే ముందు అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఆర్య మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించి ఉండడంతో ఆర్య 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేకపోయింది. కానీ ఈ మూవీ కి మంచి ప్రేక్షకదరణ మాత్రం ఆ తర్వాత బుల్లి తెర ద్వారా దక్కుతూనే వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఆర్య 2 మూవీ బృందం వారు ఈ సినిమాకు రెండు రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తాజాగా విడుదల చేసింది. 

తాజాగా ఈ మూవీ బృందం ఆర్య 2 మూవీ కి 2 రోజుల్లో 5.64 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు అల్లు అర్జున్ హీరో గా రూపొందిన దేశముదురు , ఆర్య 2 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. రీ రిలీజ్ లో భాగంగా దేశముదురు , ఆర్య 2 రెండు సినిమాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: