గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా స్టార్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు దర్శకత్వం లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది .. ఈ సినిమా లో చరణ్ కు జంట గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది . అలాగే రామ్ చరణ్ కెరియర్ లోనే 16 వ సినిమా గా ఓ సాలిడ్ మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా లో రామ్ ఎలా కనిపిస్తారు అనేది తాజా గా రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అందరి కీ ఒక క్లారిటీ వచ్చేసింది .. ఇక మరి శ్రీరామనవమి కానుక గా వచ్చిన పెద్ది ఫస్ట్ షార్ట్ చూసి అందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ కూడా అయింది .. ప్రధానంగా గ్లింప్స్ చివర్లో షాట్ అయితే ఆఫ్ లైన్ లో గట్టిగా రీచ్ నే సొంతం కూడా చేసుకుంది అని కూడా చెప్పవచ్చు ..
 

అందులో రామ్ చరణ్ అలా బ్యాట్ కిందకి గుద్ది పట్టు సవరించి బాల్ ని కొట్టే సన్నివేశాన్ని ఆఫ్లైన్లో యువత గట్టిగా ట్రెండ్ చేస్తూ ఫాలో అవుతూ  రీల్స్ కూడా చేస్తున్నారు .. ఇక దీంతో పెద్ది సినిమాకి కావాల్సినంత హైప్‌ రీచ్ రెండు ఈ ఒక్క షాట్ తోనే వచ్చేసాయి అని కూడా చెప్పవచ్చు .. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా .. వృద్ధి సినిమాస్ వారు నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసింది .. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఎంతో వైల్డ్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు .  మరో రంగస్థలంల ఈ సినిమా కూడా రామ్ చరణ్ కు మెమొరబుల్ సినిమా గా మిగులుతుంది అని కూడా బుచ్చిబాబు ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు .. ఇక మరి చరణ్ కు ఈ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర స‌రైన అయిన బ్లాక్ బస్టర దొరుకుతుందో లేదో అనేది కూడా చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: