
తాను గౌతమీపుత్ర శాతకర్ణిగాను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వశిష్టి పుత్ర పులోమావి పాత్రలో విక్టరీ వెంకటేష్ను అనుకున్నారు. ఈ విషయాన్ని వెంకటేష్ కు చెప్పటం వెంకటేష్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఉత్సాహంతో ఓకే చెప్పటం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే క్రమంలో కొద్ది రోజులు గ్యాప్ రావడం ఆ వెంటనే 1994 ఎన్నికలు రావడం ఎన్టీఆర్ ఎన్నికల కోసం 7 - 8 నెలల నుంచి ముమ్మరంగా ప్రచారం చేయటం ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. అయితే 2017 లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో జరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ వెంకటేష్ గౌతమీపుత్ర శాతకర్ణి ప్రాజెక్టు కార్యరూపం దాల్చి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాగా చరిత్రలో అలా నిలిచిపోయి ఉండేది.