
టాలీవుడ్ లో పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే కేవలం భారీగా రెమ్యునరేషన్ ఇస్తే సరిపోదు .. వారికి లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సిందే. బయటకు లాభాల్లో వాటా లెక్కన చేసాము అని కలరింగ్ ఇస్తారు .. కానీ తీసుకోవలసిన మొత్తం తీసుకుంటూనే లాభాలలో వాటా తీసుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎవరు బ్యానర్లు వారికి ఉన్నాయి. పైగా పెట్టుబడి పెట్టకుండా లాభం తీసుకుంటున్నారు .. ఏమైనా అంటే తమ పేరు చూపించే కదా సినిమాకు ఫైనాన్స్ తీసుకుంటున్నారు .. సొంత పెట్టుబడి ఏమీ పెట్టడం లేదు కదా అని లాజిక్ తెస్తారు. అది ఒకప్పుడు ఒకరిద్దరు హీరోల కు మాత్రమే ఉండేది .. ఇప్పుడు అందరి హీరోలు అదే దారిలో పడుతున్నారు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలకు తన అన్నదమ్ములు .. అక్కాచెల్లెళ్ల పేర్లు జోడించేవారు. అప్పుడు లాభాల్లో వాటా కాదు జస్ట్ నామినల్ అమౌంట్ వారికి అందించేవారు. తర్వాత ఆ పద్ధతిని వదిలేశారు.. అల్లు అర్జున్ కూడా కొన్నాళ్ళకు ఇదే పద్ధతి పాటించారు. మేనమామలతో పాటు నాగబాబుకు ఇలా కొంత సాయం చేశారు. కానీ అలవైకుంఠపురంలో సినిమాకు గీతా బ్యానర్ జోడించి రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో సగం వాటా తీసుకున్నారు.
ఇక బన్నీ పుష్ప 2 సినిమాకు టోటల్ బిజినెస్ లో 27.5% వాటా తీసుకున్నారని .. ఇక రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అట్లీతో చేసే సినిమాకు అలా చేయడం లేదు. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు మాత్రం మళ్లీ గీతా బ్యానర్ యాడ్ చేసి సగం లాభాలు ఆ సంస్థకు వెళ్లేలా చేస్తారని తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా గత కొంతకాలంగా తన సినిమాలు కు ఎన్టీఆర్ ఆర్సి బ్యానర్ జోడిస్తున్నారు. రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో వాటా అదనంగా తీసుకుంటున్నారు. త్వరలో చేయబోయే నీల్సన్ సినిమాకు ఇదే పద్ధతి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పద్ధతికి ఎన్టీఆర్ అంగీకరించినందునే గతంలో త్రివిక్రం డైరెక్షన్లో హారిక హాసిని బ్యానర్లో తెరకేక్కాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది అన్న టాక్ వినిపించింది. అంతకుముందు ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పద్ధతి మీద సినిమా చేశారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు ఎన్టీఆర్ లాభాలలో వాటా అడగడంతో అందుకు త్రివిక్రమ్ ఒప్పుకోలేదట. ఎన్టీఆర్ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఎన్టీఆర్‌కు .. త్రివిక్రమ్‌కు మధ్య చిన్నపాటి గ్యాప్ మొదలైంది అన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి.