- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వి వి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆయన రీయంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అయితే ఆ సినిమా రీమేక్‌. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఒక్క బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీర‌య్య‌ సినిమా మాత్రమే కమర్షియల్ గా అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆచార్య - సైరా  - భోళా శంకర్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంట‌సీ సినిమా విశ్వంభ‌ర‌. ఈ సినిమా మీద కూడా పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. ఈ సినిమా త్వరలో నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే.


సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. చిరంజీవికి రీ ఎంట్రీ తర్వాత అనుకున్న స్థాయిలో సక్సెస్ లేక పోయినా ప్రతి సినిమాకు రెమ్యూనికేషన్ పెంచుకుంటూ పోతున్నారు. భోళా శంకర్ లాంటి డిజాస్టర్. ఈ ప్లాప్‌ సినిమాకే చిరంజీవి ఏకంగా 65 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నా.రు సినిమా డిజాస్టర్ కావడంతో ఐదు కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు అన్న ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా కు చిరంజీవి తొలిసారిగా తన కుమార్తె సుష్మిత బ్యానర్ను తన సినిమాకు జోడించబోతున్నారు. ఈ సినిమాకుగాను చిరంజీవికి 75 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు కుమార్తెకు బ్యానర్ పేరు ఆడ్ చేసినందుకు లాభాల్లో సగం వాటా లెక్కన ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది చాలా పెద్ద షాకింగ్ గా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: