టాలీవుడ్ నటుడు నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీల ఈ మూవీ లో నితిన్ కు జోడిగా నటించగా ... ఛలో మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదటి పెట్టిన మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత భీష్మ మూవీ తో మరో సక్సెస్ను అందుకొని దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వెంకీ కొడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెబిట్ వార్నర్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు.

ఈ సినిమాను మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఈ సినిమాలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఆదిద సర్ప్రైజ్ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ లో కేతిక అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసింది. 

ఇక ఈ సాంగ్ లో ఈ బ్యూటీ వేసిన కొన్ని స్టెప్స్ కూడా వైరల్ గా మారాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల అయిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు కూడా కాస్త పెరిగాయి. అంత క్రేజ్ కలిగిన ఈ సాంగ్ యొక్క ఫుల్ వీడియోను ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేశారు. ఆ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీలోని ఆదిద సర్ప్రైజ్ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: